
దేశంలోనే రోల్ మోడల్ గా వాలంటరీ వ్యవస్ధ ప్రవేశ పెట్టడంతోపాటు వారి సేవలకు గుర్తుగా ఎంపిక చేసిన వారిని ఆర్ధిక బహుమతులతో సత్కరించడం ద్వారా దేశంలో ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యేకత సృష్టించారనీ కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. రావులపాలెం సి.ఆర్.సి లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి వన్నె తెచ్చేది వాలంటీర్లే నని, కోవిడ్ విజృంభణ సమయంలో మీ సేవలు వెలకట్టలేనివని ముఖ్యమంత్రి స్వయంగా గుర్తించి చక్కగా సేవలందించిన వారికి అవార్డులు…రివార్డులు ఇవ్వాలని ఎంచారన్నారు.. అనేక దుష్టశక్తులు ఈ వ్యవస్థను దోషిగా నిలబెట్టాలని పగటికలలు కన్నారని. అతిపెద్ద వ్యవస్ధలో లోపాలు అక్కడక్కడ సహజంగా వచ్చినంత మాత్రాన ఆ విభాగం చెల్లనిదైపోదన్నారు. లోపాలు సరిదిద్దుకుంటూ ముందుకు సాగుదామన్నారు. ఇవాళ సేవకులుగా మీ ప్రతిభ కన్పరిచారు కనుక రేపు ఊహించని రీతిన మీ రక్షణ చూసుకునేందుకు సీఎం జగన్ ముందుకొస్తారేమో. అందుకే మీ సేవలలో లోపం లేకుండా మానవతా దృక్పథంతో పనే దైవంగా సాగిపోవాలని పిలుపిచ్చారు. అనంతరం ఉత్తమ సేవ వజ్ర, సేవ రత్న అవార్డులకు ఎంపికైన వాలంటీర్లకు అవార్డులు, రివార్డులు అందించారు.
Be the first to comment