KGF-2 ఎడిటర్‌… 19 ఏళ్ల టీనేజర్‌…?

 

కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ గురువారం(ఏప్రిల్‌14)న  ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

  • స్టార్‌ మీరో యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
  • ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈసినిమాకు అన్ని భాషల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది.
  • ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది.
  • ఇంత పెద్ద భారీ ప్రాజెక్టుకు స్టార్ ఎడిట‌ర్ ప‌నిచేసి ఉంటాడ‌ని అంతా అనుకుంటున్నారేమో.

  • కానీ అలాంటిదేమి లేదు. ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేసింది కేవలం 19 ఏళ్ల కుర్రాడు.

  • ఉజ్వల్ కుల్‌కర్ణి అనే ఈ కుర్రాడు గ‌తంలో షార్ట్ ఫిలింస్, ఫ్యాన్ ఎడిట్స్ వంటివి చేస్తూ ఉండేవాడు.

  • అయితే కేజీఎఫ్‌ ఫస్ట్‌ పార్ట్‌కి అతను చేసిన కొన్ని ఫ్యాన్‌ ఎడిట్స్‌ ప్రశాంత్‌ నీల్‌కు బాగా నచ్చాయి.

  • దీంతో కేజీఎఫ్‌ ఛాప్టర్‌-2కి ఎడిటింగ్‌ బాధ్యతలను అప్పగించాడు.

  • అందుకు తగ్గట్లే ఉజ్వల్‌ కూడా హాలీవుడ్‌ రేంజ్‌లో తన పనితనాన్ని చూపించాడు. సినిమా సక్సెస్‌లో ఉజ్వల్‌ పాత్ర చాలా కీలకంగా మారింది.

  • ఇంత త‌క్కువ వ‌య‌స్సులోనే పాన్ ఇండియా సినిమాకు ఎడిట‌ర్‌గా ప‌నిచేయ‌డం నిజంగా ఉజ్వ‌ల్‌కు పెద్ద అఛీవ్ మెంట్ అని అంటున్నారు నెటిజన్లు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*