10 లక్షల విలువైన మద్యం బాటిళ్లతో వెళ్తున్న వాహనం బోల్తా…

 

చెన్నై: తమిళనాడులోని మధురైలో హైవేపై రూ.10 లక్షల విలువైన మద్యం బాటిళ్లతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. దీంతో మద్యం బాటిళ్లన్ని ఒక్కసారిగా రహదారిపై అడ్డంగా పడిపోయాయి.

  • ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదన్నట్లుగా అక్కడ ఉండే స్థానికులు ఆ బాటిళ్లను ఎత్తుకుపోవడం ప్రారంభించారు.
  • దీంతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారడమే కాకుండా ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది.
  • ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ని క్లియర్‌ చేసేందుకు ఉపక్రమించారు.
  • అంతేకాదు కేరళలోని మనలూర్‌లో ఉన్న గోదాం నుంచి మద్యం బాటిళ్లను లోడ్ చేసి తీసుకువెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.
  • డ్రైవర్‌ వాహనాన్ని కంట్రోల్‌ చేయలేకపోవడంతో అదుపుతప్పి బొల్తాపడిందని వెల్లడించారు.
  • ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*