మహేష్ బాబు అభిమానులకు అసలు సిసలు పండుగ – Movie Review

 

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ వచ్చేసింది.

నటులు: మహేష్ బాబు,కీర్తి సురేష్,వెన్నెల కిషోర్,సముద్రఖని

దర్శకుడు: పరశురామ్

సినిమా శైలి:తెలుగు యాక్షన్ కామెడీ , రొమాన్స్,

వ్యవధి:2 Hrs 42 Min

దాదాపు రెండున్నరేళ్లుగా తెరపై మహేష్ బాబుని చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్‌కు టైం వచ్చింది. సర్కారు వారి పాట చిత్రం నేడు (మే 12) విడుదలైంది. ఇప్పటికే చాలా చోట్ల బొమ్మ పడింది. ఓవర్సీస్ నుంచి అదిరిపోయే రిపోర్ట్ వచ్చేసింది.

సర్కారు వారి పాట కథ :


బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ (మహేష్ బాబు) తల్లిదండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులను కోల్పోయిన మహేష్.. అప్పు లేని వాడు బలవంతుడు అని.. ఆ అప్పును రికవరీ చేసేవారు ఇంకా బలవంతులని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహి ఫైనాన్స్ కార్పోరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు. వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి (కీర్తి సురేష్) లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్ర నాథ్ (సముద్రఖని) కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్‌కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ (నదియా) తారసపడుతుంది. వైజాగ్‌కు వచ్చిన మహేష్ ఏం చేశాడు? బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి? అసలు పది వేల కోట్ల మ్యాటర్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

నటీనటులు


అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూల్ చేసే మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి కారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతీ ఒక్క సీన్‌లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేత్తో నడిపించేశాడు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక కీర్తి సురేష్‌ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంత వరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్బుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్ర నాథ్ పాత్రలో సముద్రఖని మెప్పించాడు. తనికెళ్లభరణి, నదియా, వెన్నెల కిషోెర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను ఇలా అందరూ కూడా పర్వాలేదనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్‌లో ఓ రెండు మూడు నిమిషాలు కనిపించే సీన్‌లో నాగబాబు మెప్పించాడు.

విశ్లేషణ


సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించినా.. లోతుల్లో మాత్రం సందేశాన్ని అందింస్తుంది. అది ప్రతీ ఒక్కరికీ రిలేట్ అవుతుంది. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పుల్లేని మనుషులు సాదారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు.. తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు. అప్పు తీసుకోవడం, తీర్చడం వంటి విషయాల మీద ఈ సినిమాను నడిపించాడు దర్శకుడు. దేశంలోని ప్రస్తుత పరిస్థితి, జరిగిన కొన్ని విషయాలను స్పృశిస్తూ ఈ కథను దర్శకుడు పరుశురామ్ రాసుకున్నట్టు కనిపిస్తోంది. రైతులు, సాధారణ ప్రజలు, మధ్య తరగతి వాళ్ల మీద బ్యాంకులు చూపించే ప్రతాపం.. వేల కోట్ల ఎగవేసి విదేశాలకు పారిపోయే వారి మీద చూపించదని పరోక్షంగా చురకలు అంటించారు. కొంత మంది వేలకోట్లు ఎగవేస్తే.. వాటిని సాధారణ ప్రజల నుంచే బ్యాంకులు, ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయ్ అని ఈ సినిమా ద్వారా సందేశాన్ని అందించారు. వారు ఎగవేస్తే వాటిని ప్రజలు కడుతున్నారంటూ అందరిలోనూ ఆలోచనలు కలిగించేలా మాటలు, కథను డైరెక్టర్ రాసుకున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*