
- ఉప్పు కర్మాగారంలో కూలిన గోడ
- శిథిలాల కింద చిక్కుకున్న 30 మంది
- స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
గుజరాత్: మోర్చి జిల్లాలోని హల్వాద్ దగ్గర విషాద ఘటన చోటుచేసుకుంది.
- ఉప్పు కర్మాగారంలో గోడ కూలి కనీసం 12 మంది కార్మికులు మరణించారు.
- దాదాపు 30 మందికిపైగా కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు.
- ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
- అగ్నిమాపక దళం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు.
- ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికి తీశారు.
- ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు.
- శిథిలాల కింద మరికొంతమంది మృతదేహాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
- అలాగే జేసీబీలను ఉపయోగించి శిథిలాలను తొలగిస్తున్నారు.
- ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి… దర్యాప్తు జరుపుతున్నారు.
The tragedy in Morbi caused by a wall collapse is heart-rending. In this hour of grief, my thoughts are with the bereaved families. May the injured recover soon. Local authorities are providing all possible assistance to the affected.
— Narendra Modi (@narendramodi) May 18, 2022
ఈ దారుణ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అధికారులు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ” మోర్బీలో జరిగిన విషాదం హృదయ విదారకంగా ఉంది. ఈ దుఃఖ సమయంలో నా ఆలోచనలన్నీ మృతుల కుటుంబాల గురించే. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. స్థానిక అధికారులు బాధితులకు అన్ని విధాలా సాయం చేస్తున్నారు.” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దీనిపై హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా విచారం వ్యక్తం చేశారు. అలాగే ఈ దురదృష్ట ఘటనలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం ప్రకటించింది.
Be the first to comment