శనివారం నుండి రు.300 టికెట్లు విడుదల చేయనున్న TTD…

 

  • శనివారం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
  • రోజుకు 25 వేల చొప్పున టికెట్లు అందుబాటులోకి
  • వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచన

తిరుపతి : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. శనివారం తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. రోజుకు 25 వేల టిక్కెట్లు విడుదల చేయనుంది. శనివారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో టిక్కెట్లు విడుదల కానున్నాయి. భక్తులు https://tirupatibalaji.ap.gov.in/వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ సూచించింది.

వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో.. జులై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. అయితే వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం ప్రొటోకాల్‌ ప్రముఖులకు పరిమితం చేశామని.. తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారని టీటీడీ భావిస్తోంది. భక్తులకు కొండపై క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఏప్రిల్‌ 24 నుంచి ప్రత్యేక దర్శనాన్ని పునరుద్ధరించినట్లు టీటీడీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు ఎక్కువ స‌మ‌యం వేచి ఉండ‌కుండా నిర్దేశిత స్లాట్‌లో స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*