
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ NIA కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది.
- జీవిత ఖైదుతోపాటు రూ. 10లక్షల జరిమానా విధించింది.
- పదేళ్లు కఠిన కారాగార శిక్ష, మరో ఐదేళ్లు ఉపా చట్టం కింద శిక్ష అమలు చేయాలని తీర్పునిచ్చింది.
- అంతకుముందు సెక్షన్ 121 కింద యాసిన్ మాలిక్‌కు ఉరిశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టులో వాదనలు వినిపించింది.
- ఈ సెక్షన్ కింద ఉరి మ్యాగ్జిమమ్ పనిష్‌మెంట్ కాగా.. అతితక్కువ అంటే యావజ్జీవమే.
- ఈ నేపథ్యంలో యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
- కేసు విచారిస్తున్న రాజీవ్ కుమార్ శర్మ సెలవుల్లో ఉన్నందున స్పెషల్ జడ్జీ ప్రవీణ్ సింగ్ తన తీర్పును వెల్లడించారు.
- మాలిక్‌తో పాటు పలువురు కశ్మీరీ వేర్పాటువాద నేతలపై కూడా అభియోగాలు నమోదయ్యాయి.
- ఈ కేసులో లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌లపై కూడా NIA ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
Be the first to comment