F3 సినిమా రివ్యూ…

 

  • నటులు: వెంకటేష్,వరుణ్ తేజ్,తమన్నా,మెహరీన్,మురళీ శర్మ,రాజేంద్ర ప్రరసాద్,సోనాల్ చౌహాన్
  • దర్శకుడు: అనిల్ రావిపూడి
  • సినిమా శైలి:కామెడీ , ఫామిలీ , డ్రామా
  • వ్యవధి:2 Hrs 28 Min
  • రేటింగ్ : 2.75 / 5

మ‌న ఇండ‌స్ట్రీలో ఉన్నంత మంది కమెడియ‌న్స్ మ‌రో ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌రు. మ‌న ద‌ర్శ‌కులు సినిమాల్లో కామెడీకి ఇచ్చే ప్రాధాన్య‌త అంత ఎక్కువ‌గా ఉంటుంది మ‌రి. అలా చేసే చిత్ర‌మేదైనా కామెడీకి ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చే ద‌ర్శకుల కోవ‌లోకి వ‌చ్చే నేటి త‌రం ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి.

ఈయ‌న సినిమాల‌ను గ‌మ‌నిస్తే తొలి చిత్రం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కామెడీ ట్రాక్‌కి చాలా మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 2019లో రూపొందిన చిత్రం F2 : ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేషన్ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. అప్ప‌ట్లోనే ఆ సినిమాకు ఫ్రాంఛైజీగా F3 సినిమా చేస్తామ‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు ప్ర‌క‌టించారు. అన్న‌ట్లుగానే F3 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

F2లో భార్య‌ల పెట్టే ఇబ్బంది నుంచి త‌ప్పించుకునే భ‌ర్త‌లుగా వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ పండించిన కామెడీ సిల్వ‌ర్ స్క్రీన్‌ను అల‌రించింది. ఇప్పుడు F3లో మ‌నీ అనే అంశాన్ని యాడ్ చేశారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ అన్ని సినిమాపై అంచ‌నాల‌ను పెంచేలా చేశాయి.

విశ్లేష‌ణ‌:

మూడేళ్ల ముందు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ – వ‌రుణ్ తేజ్.. త‌మ‌న్నా – మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా దిల్‌రాజు – శిరీష్ నిర్మించిన F 2 సినిమా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా పెద్ద సక్సెస్ అయ్యింది.

అదే స్టైల్‌లో అదే టీమ్ చేసిన మ‌రో ప్ర‌య‌త్న‌మే F3. అప్పుడు భార్య‌ల వ‌ల్ల ఇబ్బంద‌లు ప‌డే భ‌ర్త‌లుగా న‌టించిన వెంకీ, వ‌రుణ్‌.. F3లో డ‌బ్బుల కోసం తాప‌త్ర‌య ప‌డే వ్య‌క్తులుగా క‌నిపించారు. ప్ర‌తి మనిషికి డ‌బ్బు అంటే ఆశ ఎక్కువ‌. ఆ డ‌బ్బు చుట్టూ తిరిగే ఈ లోకంలో మ‌నిషి ఎలా ప్ర‌వ‌ర్తిస్తుంటాడు అనే కాన్సెప్ట్‌తో క‌థ‌ను త‌యారు చేసుకున్నాడు అనీల్ రావిపూడి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*