TDP నేత చింతమనేని ప్రభాకర్‌కు బెదిరింపు కాల్స్‌…?

 

ఏలూరు: టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌కు బెదిరింపు కాల్స్‌ వచ్చింది. ‘నీ హత్యకు షూటర్‌ని మా బాస్‌ నియమించాడు’ అని గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసినట్లు చింతమనేని చెబుతున్నారు. ఆగంతకుడి ఫోన్‌కాల్‌పై త్రీటౌన్‌ పోలీస్ స్టేషన్‌లో చింతమనేని ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో చింతమనేని పేర్కొన్నారు. ఇటీవల ‘‘నన్ను ఎన్‌కౌంటర్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించింది. టీడీపీ నాయకులు స్పందించకుంటే ఎప్పుడో చనిపోయేవాడ్ని. నా లాయర్‌కు సజ్జల వార్నింగ్‌ ఇచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించినందుకు నాపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉంది. సీఎం జగన్‌తోపాటు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, నవ్‌జ్యోత్‌సింగ్‌ గ్రేవల్‌తో పాటు స్థానిక పోలీసులు, అధికారులు, సహకరించిన 21 మందిని శిక్షించాలి’’ అంటూ ఏలూరు మొబైల్‌ కోర్టులో  చింతమనేని ప్రభాకర్‌ ప్రైవేట్‌ కేసు దాఖలు చేశారు…!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*