యడ్లపాడులో చోరీ…

 

యడ్లపాడు: మండల కేంద్రమైన ఎడ్లపాడు బీసీ కాలనీలో శనివారం రాత్రి దొంగలు హల్ చల్ చేశారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో తాళాలను పగులగొట్టి ఇళ్లల్లోకి ప్రవేశించిన దుండగులు అల్మరాలు బీరువాలు పగలగొట్టి అందులోని బంగారు ఆభరణాలు నగదు చోరీ చేశారు . వస్తువులను చెల్లాచెదురుగా పడవేశారు. వివరాల్లోకి వెళితే కాలనీలోని బత్తుల సీతారామయ్య, తుర్లపాటి నాగమణి, వెంకటేశ్వరరాజు ల నివాసగృహాలు లోకి ప్రవేశించిన దుండగులు 6.5 సవర్ల బంగారు ఆభరణాలు 27 వేల నగదు గ్యాస్ సిలిండర్ ను ఎత్తుకెళ్లారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*