RTC బస్ స్టాండ్ లో CC కేమెరాల పని తీరును, ప్రయాణికులు భద్రత కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేయాలని పాత గుంటూరు SHO కు ఆదేశాలు జారీ…

 

  • గుంటూరు RTC బస్ స్టాండ్ లో సి సి కేమెరాల పని తీరును మరియు ప్రయాణికులు భద్రత కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేయాలని పాత గుంటూరు SHO కు ఆదేశాలు జారీ చేసిన జిల్లా SP ఆరిఫ్ హఫీజ్ IPS

గుంటూరు:  సత్వరమే సీసీ కెమెరాలు పనితీరుపై సత్వరమే దృష్టి సాధించి నిత్యం సీసీ కెమెరా ల పుటేజ్ ల పనితీరును పరిశీలించాల్సిందిగా పాత గుంటూరు SHO వాసు ను ఎస్పీ గారు ఆదేశించడం జరిగింది.

  •  గుంటూరు CCS DSP  ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్టాండ్ లోను పరిసర ప్రాంతాల్లోనూ మఫ్టీ పోలీస్ సిబ్బందిని నియమించి జేబు దొంగలు మరియు అమాయక ప్రయాణికులను మభ్య పెట్టి నగదు నగలు దోచుకును వారిని పట్టుకొని వారిపై కేసులు నమోదు చేయలని,]
  • అలానే ఎలాంటి దొంగతనాలు అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గట్టి నిఘా ఉంచాలి అని గుంటూరు CCS DSPని SP ఆదేశించడం జరిగినది.
  • రక్షక్ మరియు బ్లూ కోల్ట్స్ పోలీస్ వారితో రాత్రిపూట గస్తీ ముమ్మరం చేయాలని, ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తూ,ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
  • గుంటూరు జిల్లా పరిధిలో ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే పోలీస్ కంట్రోల్ రూమ్ కు( Dail 100) కు గాని లేదా ఆ ఏరియా సంబంధిత పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు SP తెలిపారు.
  • మరీ ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ నుండి గుంటూరు పరిసర ప్రాంతాలకు మరియు దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో చనువుగా ఉండకూడదని, ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చి మీరు తెలిసినట్టు మీ ప్రక్కన కూర్చొని మీమ్మను అమాయకపు మాటలతో మభ్యపెట్టి మీ వద్ద ఉన్న విలువైన వస్తువులు మరియు నగదు దోచుకొనుట కు అవకాశం ఉన్నందున తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకోవద్దు మీకు వారిపై అనుమానం వచ్చినట్లయితే ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయలి
  • ఈ విషయాన్ని ప్రయాణికులందరూ గమనించాలని SP తెలియజేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*