G.O. No. 117 రద్దు కొరకు FAPTO ఆధ్వర్యంలో నిరసన…

 

పల్నాడు:  జిల్లా విద్యాశాఖ కార్యాలయo వద్ద G.O. No. 117 రద్దు కొరకు FAPTO ఆధ్వర్యంలో ఉదయం 10.00 గంటలకు జరుగు నిరసన కార్యక్రమానికి పల్నాడు జిల్లా పరిధిలోని అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా బాధ్యులు, ముఖ్య కార్యకర్తలు, ఉపాద్యాయులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయడం జరిగినది.

STU జిల్లా ప్రధాన కార్యదర్శి యూ చంద్ర జీత్ యాదవ్ అధ్యక్షతన జరిగిన నిరసన లోరాష్ట్ర ఉపాధ్యక్షులు SM సుభాని ,జే గంగాధర్ బాబు ,రాష్ట్ర కార్యదర్శి పోటు శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య ,షేక్ కరిముల్లా ,షేక్ సిలార్, రాఘవ, ఆంజనేయులు అన్ని మండలాల ఎస్టీ యూ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసంగించారు.

G.O. No. 117 రద్దు చేసేవరకు FAPTO ఆద్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బహీనవర్గాలకు చదువును దూరం చేసే విధంగా జీఓ వుందని అన్నారు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ వున్నా ఈ జీవో వల్ల ఉపాధ్యాయ పోస్టులు మిగులు చూయించడం బాధాకరమన్నారు రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పునారాలోచించు కావాలన్నారు లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయు లందరూ ఉద్యమించాల్సి వస్తుందన్నారు 3,4,5 తరగతులు విలీనం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*