
విశాఖ జిల్లా: గాజువాక నియోజకవర్గంలో 23,374 మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయి. పండుగ వాతావరణం లో గురువారం మున్సిపల్ స్టేడియంలో గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో అక్కచెల్లెమ్మలకు పట్టాలు పంపిణీ చేశారు.
కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు,ఎంపీ ఎం వీ వీ సత్యనారాయణ గారు,పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Be the first to comment