అధికారంలోకి వచ్చి అన్ని అవకాశాలను హరించివేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం : ప్రత్తిపాటి పుల్లారావు

 

చిలకలూరిపేట: 34, 35 వార్డులలో టిడిపి నేతల ఆధ్వర్యంలో తలపెట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చిలకలూరిపేట పట్టణంలోని 34, 35 వార్డులలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. టిడిపి నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ సిఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని జగన్ నిరంకుశ వైఖరితో రాష్ట్రాన్ని బ్రష్టు పటించారని ధ్వజమెత్తారు నిత్యావసర ధరలు, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో పాటు భారీ విద్యుత్ కోతలతో ప్రజలు, రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు వైకాపా ప్రభుత్వం చేతగానితనం వల్లే విద్యుత్ లేమి సమస్యలు తలెత్తాయాని జగన్ అసమర్థ పాలన చేతగాని తనముతో రాష్ట్ర ప్రజలపై కరెంట్ చార్జిల బాదుడు, ఆర్టిసి చార్జిల బాదుడు, నిత్యావసరుకుల ధరల బాదుడులతో ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు

ఒక చేత్తో పథకాల రూపంలో 10 రూపాయలు ఇస్తూ మరో చేత్తో 100 రూపాయలు ప్రజల వద్ద నుండి వసూలు చేస్తూ ప్రజలను జగన్ ప్రభుత్వం వంచిస్తు౦దని తెలిపారు పెట్రోల్, డీజిల్ పై దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా రాష్ట్ర పన్నులు మన రాష్ట్రంలో ఉన్నాయని పెట్రోల్ లీటరు 121 రూపాయలు దేశంలో ఏ రాష్ట్రంలో లేదని ఇంకా సిగ్గు లేకుండా పెట్రోల్, డీజిల్ ధర కేంద్రం పెంచుతుందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు ఆస్తిపన్ను, నీటిపన్ను, రిజిస్ట్రేషన్ చార్జీలు 3 సార్లు, ఆర్టీసీ చార్జీలు 7 సార్లు, విద్యుత్ చార్జీలు పెంచి అన్ని వర్గాలను ముంచేశారని తెలిపారు ప్రతి ఏటా అమ్మఒడి అమలు చేస్తామని హామీ ఇచ్చి ఈ విద్యాసంవత్సరం ఎందుకు అమ్మఒడి ఇవ్వలేదని నిలదీశారు దశల వారీ మద్యనిషేధం అని చెప్పి వాక్ ఇన్ మాల్స్ పేరిట కొత్త మద్యం దుకాణాలు తెరిచి ఆడవాళ్లను నిలువునా మోసం చేశారని తెలిపారు వారంలో సి.పి.ఎస్ రద్దు అని చెప్పి ఇప్పుడు అవగాహన లేదని చెప్పడం ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు?

3000 పెన్షన్ ఇస్తానని 1000 దాటిన ఆసుపత్రి బిల్లులు తానే కడతానని వారంలో సి.పి.ఎస్ రద్దు చేస్తానని ప్రత్యేక హోదా తెస్తానని మద్యనిషేధం చేస్తానని సన్నబియ్యం ఇస్తానని రాష్ట్రంలో ప్రజలను నమ్మించి ఒక్క అవకాశం ఇవ్వమని అడిగి అధికారంలోకి వచ్చి ఉన్న అవకాశాలను అన్ని౦టిని హరి౦చేశాడని విమర్శించారు ఈ మూడేళ్ల వైకాపా పాలనలో సంక్షోభమే మిగిలిందని ఉద్ఘాటించారు

34 వ వార్డు ప్రెసిడెంట్ మంగా నాయక్, నున్సవతు సాంబశివ నాయిక్( నియోజకవర్గ ST Cell ప్రెసిడెంట్), బాణావతు రమేష్ నాయక్, వడితే అంజి నాయక్, ఇస్లావత్ స్వామి నాయక్, వడితే గోవిందు నాయక్, సాతలావతు రాజు నాయక్, కేశవ నాయక్, జరపాల మోతీ బాయ్, జరపాల లక్ష్మీ బాయ్, నున్సవతు స్వాతి బాయ్, నున్సవతు పాండు నాయక్, నున్సవతు రమేష్ నాయక్, బాణావతు నారాయణ నాయక్, బాణావతు చిన్న నాయక్, కోడావతు కేస్యా నాయక్, కోడావతు శ్రీను నాయక్, బాణావతు శివ శంకర్ నాయక్, నంబూరి అంజి, రామయ్య, చెంచయ్య, 35వార్డు సెక్రెటరీ బాచిన రఘుబాబు, జానుబాబు, సురేష్ బాబు , రాష్ట్ర, జిల్లా, నాయకులు, ముఖ్య నాయకులు, పార్టీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, వార్డుల మహిళలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*