
చిలకలూరిపేట : ది.19.06.2022 వ తేదీన రాత్రి సుమారు 1 గంట సమయములో చిలకలూరిపేట మండలంలోని, పోతవరం గ్రామ శివారులో రాజాపేట గ్రామం వైపు వెళ్ళు దారిలో దార్ల ఆదిశేషమ్మ w/o ఆదినారాయణ, 65సం,,లు, అను ఆమెను ఆమె యొక్క పెద్ద కొడుకు అయిన దార్ల వీరయ్య @ బుచ్చి బాబు S/O ఆదినారాయణ 47 సం,,లు, కులం తెలగ, 15వ వార్డు, వడ్డవల్లి, సత్తెనపల్లి టౌన్ అనునతను తన తల్లి ఇంట్లో ఉండడం వలన ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని భావించి ఆమెను చంపాలనే ఉద్దేశ్యముతో ఆమెను మోటార్ సైకిల్ పై పోతవరం గ్రామ శివారులోనికి తీసుకొని వచ్చి తనతో తెచ్చుకున్న బ్లేడ్ తో మృతురాలి గొంతుకోసి పారిపొయినాడు. అంతట మృతురాలిని 108 అంబులెన్సు లో చికిత్స నిమిత్తం పంపగా మృతురాలు చికిత్స పొందుతూ గుంటూరు GGH లో మరణించినది. సదరు కేసులో ముద్దాయి అయిన దార్ల వీరయ్య @ బుచ్చి బాబు S/O ఆదినారాయణ ను ఈ రోజు అనగా ది:21-06-20221వ తేది శ్రీ చిలకలూరిపేట రూరల్ CI గారు అయిన శ్రీ Y.అచ్చయ్య గారు ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినారు.
Be the first to comment