వేలూరు గ్రామ భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు బొంతా దేవమ్మ మృతి…

 

చిలకలూరిపేట:  వేలూరు గ్రామ భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు బొంతా దేవమ్మ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందడం జరిగింది. ఆమె పార్థివదేహానికి గ్రామ, ఏరియా CPI పార్టీ నాయకులు నివాళులర్పించారు. భౌతిక కాయంపై నాయకులు ఎర్ర జండా ను కప్పి విప్లవ నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీలో, మహిళా సమాఖ్య లో బొంత దేవమ్మ అంకుఠిత దీక్ష తో పని చేయడం జరిగిందని తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపి పార్టీ ఎప్పుడూ కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. ఆమె మృతి పార్టీకి తీరని లోటన్నారు. సంతాపం తెలిపిన వారిలో సిపిఐ పట్టణ కార్యదర్శి పేలూరి రామారావు, గ్రామ పార్టీ కార్యదర్శి కందిమళ్ళ వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు తాళ్లూరి బాబురావు, సురభి రాజు, బొంతా సుబ్బారావు, బొంతా ఏవహను, తంగిరాల జీవరత్నం, బొంతా శేషయ్య, బొంత నాగయ్య, బొంతా జాన్ తదితరులు ఉన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*