
పల్నాడు జిల్లా: రొంపిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యాయత్నం ఘటనకి సంబంధించి నిందితుడిని గంటల వ్యవధిలోనే పోలీస్ వారు అరెస్ట్ చేశారు.
- ఈ ఘటనలో నిందితుడు మరియు బాధితుడు ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన వారే.
- పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు స్థానిక నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యాయత్నానికి సంబంధించి వివరాలను వెల్లడించిన సత్తెనపల్లి డిఎస్పీ విజయభాస్కర్ రెడ్డి.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ…
- ఈ రోజు ఉదయం రొంపిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అలవాల గ్రామంలో రొంపిచర్ల టిడిపి మండల అధ్యక్షుడైన బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం జరిగినదని అందిన సమాచారం మేరకు మా పోలీస్ వారు కేసు నమోదు చేసి,సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్ట్ చేయడం జరిగినది.
- వివరాల్లోకి వెళితే బాధితుడు బాల కోటిరెడ్డి మరియు నిందితుడు వెంకటేశ్వర రెడ్డి ఇద్దరు ఒకే గ్రామంలో టీడీపీ పార్టీకి చెందినవారే.పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని,కొన్ని పార్టీ కార్యక్రమాలకు కూడా తనను ఆహ్వానించడం లేదని,దానికి బాలకోటిరెడ్డి కారణమని భావించి,వెంకటేశ్వర రెడ్డి అతనిపై కక్ష పెంచుకున్నాడు.
- ★ ఈ క్రమంలో ఈ రోజు ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో ఉదయం నడకలో బాలకోటిరెడ్డి మరియు వెంకటేశ్వర రెడ్డిలు ఇద్దరు ఒకరికి ఒకరు తారసపడటం జరిగినది.ఒకరిని మరొకరు దూషించుకునే క్రమంలో వివాదం చెలరేగి,నిందితుడు వెంకటేశ్వర రెడ్డి,బాధితుడు బాల కోటిరెడ్డిపై కర్రతో దాడి చేయగా బాలకోటిరెడ్డి కిందపడగా,మరలా అక్కడ ఫెన్సింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్న పదునైన రాళ్లతో తలపై మోదగా తలకు బలమైన రక్త గాయం అయింది.
- స్థానికుల సహాయంతో ఆ గ్రామంలోని RMP వద్ద ప్రధమ చికిత్స తీసుకున్న అనంతరం బాధితుడు బాల కోటిరెడ్డి నరసరావుపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
- బాలకోటిరెడ్డి కొడుకు నర్సిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ హత్యాయత్నం ఘటనకి సంబంధించి మా రొంపిచర్ల ఎస్సైగారు IPC 307 కింద కేసు నమోదు చేసి,నరసరావుపేట రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి ఆధ్వర్యంలో గాలింపు చేపట్టి కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగినది.రేపు గౌరవ కోర్టు వారి ముందు హజరుపరుస్తాము.
- ఈ ఘటన ఇద్దరు టీడీపీ గ్రామ నాయకుల మధ్య పార్టీపరంగా అంతర్గత కక్షల కారణంగా చోటుచేసుకున్నది.
- పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే మా పోలీస్ వారి ప్రధమ కర్తవ్యం.చట్టవ్యతిరేకమైన కార్యకలపాలకు ఎవరు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము.
- ఈ సమావేశంలో డిఎస్పీ తో పాటు నరసరావుపేట రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి రొంపిచర్ల ఎస్సై సురేష్ పాల్గొన్నారు…!!
Be the first to comment