విశాఖ RK బీచ్‌కు వెళ్లిన జంట – సముద్రంలో గల్లంతైన వివాహిత…

 

విశాఖ : పెళ్లిరోజు నాడు సరదాగా భర్తతో కలిసి బీచ్‌కు వెళ్లిన వివాహిత గల్లంతయ్యారు. నగరంలోని ఎన్‌ఏడీ సంజీవ నగర్‌లో శ్రీనివాస్‌, సాయిపల్లవి జంట నివాసం ఉంటోంది. వీరి పెళ్లి రోజు కావడంతో సరదాగా గడపడానికి సోమవారం సాయంత్రం విశాఖ ఆర్‌కే బీచ్‌కు వెళ్లారు. తీరంలో సరదాగా గడుపుతున్న సమయంలో సాయి పల్లవి సముద్రంలో గల్లంతైంది. భర్త శ్రీనివాస్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సముద్రం ఒడ్డున సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో తనకు మెసేజ్‌ రావడంతో బయటకు వచ్చానని.. తిరిగి వెనక్కి చూసే సరికి భార్య కనిపించలేదని భర్త పోలీసులకు చెప్పుకొచ్చాడు. వెంటనే గజ ఈతగాళ్ల సాయంతో గాలించినా దొరకలేదు. రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలకు ఇబ్బందిగా మారింది. మంగళవారం సాయి పల్లవి కోసం పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు ప్రారంభించారు. సాయిపల్లవి ప్రమాదవశాత్తూ సముద్రంలో గల్లంతయ్యిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి రోజున ఈ ఘటన జరగడంతో రెండు కుటంబాల్లో విషాద చాయలు అలముకున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*