వాగులో కొట్టుకుపోయిన కారు…

 

ఏలూరు : కొయ్యలగూడెం మండలం కన్నాపురం సమీపంలో పడమటి కాలువలో మంగళవారం ఉదయం కారు గల్లంతైంది. కన్నాపురం-బుట్టాయిగూడెం మధ్యలో ఉన్న పడమటి కాలువలో కారు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా వరద ప్రవాహం వచ్చింది. గమనించిన డ్రైవర్ కారును ఆపేశారు. వాగుకు అవతల ఉన్న కొంత మంది ట్రాక్టర్‌కు, కారుకు తాడు కట్టి లాగే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వాగు ఉధృతి పెరగడంతో అందరూ చూస్తుండగానే కారు కొట్టుకుపోయింది. కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరోవైపు రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. వరద బాధితుల్ని పరామర్శించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*