
హైదరాబాద్: మంకీపాక్స్(Monkeypox) లక్షణాలతో హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రిలో చేరిన కామారెడ్డి(Kamareddy) జిల్లా వ్యక్తికి చికెన్‌పాక్స్(Chickenpox)గా నిర్ధారణ అయినట్లు హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు(Health Director G.Srinivas Rao) తెలిపారు. ఇటీవల దుబాయి(Dubai) నుంచి వచ్చిన కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి(35)కి శరీరంపై దద్దుర్లు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు ఈ నెల 24న రాత్రి హైదరాబాద్‌లోని ఫీవరాసుపత్రికి తీసుకువచ్చారు. అతడి నుంచి ఈ నెల 25న ఐదు రకాల నమూనాలు సేకరించిన వైద్యులు నిర్ధారణ కోసం పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. మంగళవారం సాయంత్రం ఫలితాలు రాగా.. ఇందులో మంకీపాక్స్ నెగిటివ్ నిర్ధారణ అయినట్లు ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. ఆయనకు చికెన్‌పాక్స్(ఆటలమ్మ) సోకిందని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. దీంతో అధికారులతో పాటు ప్రజలూ ఊపిరి పీల్చుకున్నారు.
Be the first to comment