
వాట్ ఏ ఐడియా సర్ జీ అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు పేల్చారు. కాపు నేస్తం కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. సొంత పార్టీని ఎద్దేవా చేశారు. ‘వాట్ ఏన్ ఐడియా సర్ జీ.. ఈ ఫోటోను చూసిన తర్వాత కాపు నేస్తం కార్యక్రమానికి వచ్చినవారంతా స్వచ్ఛందంగా ఈ ప్లకార్డులు తీసుకుని వచ్చారని అనుకున్నాను. కనీసం మా పార్టీ వాలంటీర్లు బస్సుల్లో తీసుకొచ్చినప్పుడు ఈ ప్లకార్డులు ప్రజలకు అందజేసి ఉంటే తెలివిగా ఉండేది’అంటూ సెటైర్లు పేల్చారు.
What an idea sir ji! Till I saw this picture I thought people came on their own with these placards for today’s Kapu Nestham program. It would have been wise at-least if these placards were given to people when they were brought in the buses itself by our party volunteers. 🤭 pic.twitter.com/c6tdWFAITJ
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) July 29, 2022
శుక్రవారం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కాపు నేస్తం మూడో విడత నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి డబ్బుల్ని అకౌంట్లలో జమ చేశారు. ఈ సభకు హాజరైన మహిళలు Thank You CM Sir అనే ప్లకార్డులు పట్టుకున్నారు. అయితే సభలో ఈ ప్లకార్డుల్ని కుర్చీల్లో ఉంచిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ఈ ఫోటోను ప్రస్తావిస్తూ రఘురామ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
Be the first to comment