బిజెపి ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయాన్ని ఖండిస్తు నిరసన దినం పాటించిన వామ పక్షాలు…

 

పల్నాడు జిల్లా:  చిలకలూరిపేట పట్టణం లోని నరసరావుపేట సెంటర్ లో అల్లూరి సీతారామ రాజు విగ్రహం వద్ద ఆదివారం కేంద్ర బిజెపి ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతులతో జరిగిన ఒప్పందాలు అమలు చేయనందుకు నిరసనగా కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ విద్రోహాన్ని నిరసిస్తూ నిరసన దినం పాటించడం జరిగింది . రైతు సంఘం నాయకులు బొల్లు శంకర రావు అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో రాష్ట్ర కౌలు రైతు సంఘం కార్యదర్శి వై రాధాకృష్ణ మూర్తి మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతాంగ 13 నెలల ఉద్యమానికి తలవొగ్గి పంటల మద్దతు ధరలు చట్టాన్ని అమలు చేస్తామని , విద్యుత్ చట్ట సవరణ బిల్లు నుండి వ్యవసాయాన్ని మినహా ఇస్తామని, లక్ష్యం పూర్ ఘటనలో నేరస్తులను శిక్షించాలని రైతుల పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని వ్రాత పూర్వక హామీ ఇచ్చి అమలు చేయకుండా ద్రోహం చేసిందని అన్నారు.

రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు తాళ్లూరి బాబు రావు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం సామాన్య ప్రజలు వాడుకునేటువంటి పాలు, మజ్జిగ పై జిఎస్టి పెంచి రైతాంగం పైన ,ప్రజల పైన భారాలు వేసిందని అన్నారు. రైతు సంఘం నాయకులు బొల్లు శంకర్ రావు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తున్న బిజెపి ప్రభుత్వం సామాన్య ప్రజల పైన రైతాంగం పైన భారాలు వేస్తుందని అన్నారు ఈ రైతాంగ వ్యతిరేక విధానాలను ఇప్పటికైనా మార్చుకోకపోతే మరొక పారు మరొకమారు దేశవ్యాప్త రైతాంగ ఉద్యమం ఉవ్వెత్తున సాగి కేంద్ర బిజెపి ప్రభుత్వం మెడలు వంచుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పేలూరి రామారావు , సిపిఐ నాయకులు చండ్ర కొండలరావు, బొంతా భగత్ సింగ్ , లక్షాధికారి, సిపిఎం పట్టణ కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు, సిపిఎం నాయకులు సాతులూరి బాబు,బి.కోటా నాయక్ , తోకల కోటేశ్వరరావు, పెద్దిరాజు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*