
పశ్చిమగోదావరి జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) పొద్దున్నే ఇంటింటికి తిరిగి పేపర్ వేస్తున్నారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా.. నిజంగానే. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆదివారం ఉదయం పేపర్‌బాయ్ అవతారమెత్తారు. వేకువజామునే పట్టణంలోని మావుళ్లమ్మపేటకు వెళ్లారు. అక్కడ ఆయన స్థానిక పేపర్‌బాయ్స్‌తో కలిసి వాటిని కట్టగా కట్టారు. అనంతరం సైకిల్‌పై 31వ వార్డులోని నాగరాజుపేట, మరికొన్ని ప్రాంతాల్లో ఇంటింటికి తిరగి పేపర్ వేశారు.
#ఇంటింటికి సైకిల్ పై పేపర్ వేస్తు నిరసన వ్యక్తం చేస్తున్న డా.నిమ్మల
ఇల్లు, ఇళ్ల స్థలాల పేరు చెప్పి మహిళలు, పేదలను దగా, మోసం చేస్తున్న జగన్ ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు మావుళ్ళమ్మ పేట, నాగరాజుపేటలలో ఇంటింటికి సైకిల్ పై తిరిగి పేపర్లు వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.. pic.twitter.com/MPToIiifzL— Nimmala Ramanaidu (@RamanaiduTDP) July 31, 2022
Be the first to comment