పేదలకు అందాల్సిన ప్రతి గింజా అందేవరకు పోరాడుతాం – MLA గొట్టిపాటి

 

అద్దంకి : రాష్ట్ర వ్యాప్తంగా కోటి 45 లక్షల రేషన్ కార్డులు ఉంటే కేవలం 89 లక్షల మందికి మాత్రమే ఉచిత బియ్యాన్ని పంపిణీ ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు MLA గొట్టిపాటి.

 • పంచభూతాలను దోచుకుంటున్న వైసీపీ నేతలకు పేదలకు అన్నం పెట్టడానికి మనసు రావడం లేదు.
 • టీడీపీ హయాంలో 1.47 లక్షలు ఉన్న కార్డులను 1.45 లక్షలకు కుదించారు…
 • ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెల వరకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయమంటే గత ఐదు నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయకుండా ఆపేసి పేదలకు అన్యాయం చేసారు.
 • ఈ 5నెలలు పేదలకు ఇవ్వాల్సిన ఉచిత బియ్యాన్ని ఆపేసి పేదల పొట్టకొట్టి వారి డబ్బులను దారి మళ్లిస్తున్నారు.
 • జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పేదలకు పండగలకు ఇచ్చే కానుకలను కూడా రద్దు చేశారని వాటికి కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని వాటిని కూడా ఆపేసిన పేదల ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ మని ఎద్దేవా చేశారు
 • నిరుపేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేసిన కఠినమైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని తెలిపారు.
 • పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన స్వర్గీయ జయలలిత గారి పేరు మీదున్న క్యాంటీన్లను రద్దు చేయకుండా అదే పేరుతో కొనసాగిస్తున్నారని
 • పంచభూతాలను దోచుకుంటున్న వైసీపీ ప్రభుత్వానికి పేదలకు అన్నం పెట్టడానికి మనసు రావడంలేదని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు
 • కేంద్ర ప్రభుత్వం చివాట్లు పెడితే ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పి బియ్యాన్ని ఇవ్వకుండా చీటీలను ఇస్తున్నారని తెలిపారు.
 • టిడిపి హయాంలో కోటి 47 లక్షలు ఉన్న రేషన్ కార్డ్ లను, వివిధ కారణాలు చూపి 1.45 లక్షలకు కుదించారని తెలిపారు.
 • పేదలకు అందవలసిన ప్రతి గింజ బియ్యం అందాల్సిందేనని పేదలకు ఉచిత బియ్యం అందే వరకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గొట్టిపాటి అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*