
జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటించి, భద్రతా బలగాలు అడుగడుగునా పహారా కాస్తున్నప్పటికీ ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు కాశ్మీరీ పండిట్‌ను కాల్చిచంపారు. అతని సోదరుడిని గాయపరిచారు. బాధితుడి సోదరుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక తాజాగా చోటు చేసుకున్న ఘటనతో మరోమారు కాశ్మీరీ పండిట్ లు భయం గుప్పిట్లో మగ్గుతున్నారు.
షోపియాన్ జిల్లాలో యాపిల్ తోటలో కాశ్మీరీ పండిట్ ను కాల్చి చంపిన ఉగ్రవాదులు షోపియాన్ జిల్లాలోని యాపిల్ తోటలో ఈరోజు కాశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. కాల్పుల్లో అతని సోదరుడు గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. బుద్గామ్‌లోని ప్రభుత్వ కార్యాలయంలో కాశ్మీరీ పండిట్ హత్యకు గురైన మూడు నెలల తర్వాతమళ్ళీ చోటు చేసుకున్న ఈ ఘటన ఆందోళన కలిగిస్తుంది. షోపియాన్‌లోని చోటిపోరా ప్రాంతంలోని యాపిల్ తోటలో ఉగ్రవాదులు పౌరులపై కాల్పులు జరిపారు. ఇద్దరూ మైనారిటీ వర్గానికి చెందినవారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
షోపియాన్ ప్రాంతంలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్…
ఉగ్రవాదులు హతమార్చిన మృతుడు కాశ్మీరీ పండిట్ 45 ఏళ్ల సునీల్ కుమార్‌గా, అతని సోదరుడిని పింటు కుమార్‌గా భద్రతా బలగాలు గుర్తించారు. దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టారు. గత ఏడాది అక్టోబర్ నుంచి కాశ్మీర్‌లో వరుస హత్యలు జరుగుతున్నాయి. బాధితుల్లో చాలామంది వలస కార్మికులు లేదా కాశ్మీరీ పండిట్‌లు. అక్టోబర్‌లో, ఐదు రోజుల్లో ఏడుగురు పౌరులు మరణించారు. వారిలో ఒక కాశ్మీరీ పండిట్, ఒక సిక్కు మరియు ఇద్దరు వలస హిందువులు.
Be the first to comment