
ఢిల్లీ : వైద్య ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రముఖ ద ఎకనమిక్ టైమ్స్ సంస్థ బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డును ప్రకటించింది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బిజినెస్ రీఫామ్ యాక్షన్ ప్లాన్ అండ్ లీడర్ ఇన్ డిజిటలైజింగ్ హెల్త్ రికార్డ్ పేరుతో ద ఎకనమిక్ టైమ్స్ సంస్థ ఈ అవార్డును గురువారం ప్రదానం చేసింది.
దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లోనూ లేని విధంగా వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, హెల్త్ రికార్డులు డిజిటలైజ్ చేయడంలో ముందుండటం వల్లనే ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ముఖ్యమంత్రి YS జగన్ మోహన్‌రెడ్డి ఆలోచనల ఫలితంగానే వైద్య ఆరోగ్య రంగంలో ఏపీ ఎంతో పటిష్టంగా ముందుకు వెళుతోందన్నారు. ముఖ్యమంత్రి మార్గనిర్దేశంలో రాష్ట్రం మరింతగా ముందుకు వెళుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని ఆయా రాష్ట్రాల మంత్రులతో ప్యానల్ డిస్కషన్ లోనూ పాల్గొన్నారు. డిజిటల్ స్పేస్ లో ఏపీ ప్రభుత్వ కృషిని వివరించారు.
Be the first to comment