
చిలకలూరిపేట: మండలం లోని పసుమర్రు వద్ద విద్యుత్ ఉపకేంద్రం ఎదురుగా శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం. మృతి చెందిన యువకుడిని బాపట్ల జిల్లా పర్చూరు కి చెందిన దుద్దుకూరు రవి (32) గా పోలీసులు గుర్తించారు. రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం డీకొట్టి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అని సంఘటన స్థలాన్ని పరిశీలించిన చిలకలూరిపేట రురల్ CI అచ్చయ్య తెలిపారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిలకలూరిపేట రురల్ CI అచ్చయ్య , SI రాజేష్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Be the first to comment