గులాంనబీ ఆజాద్ రాజీనామా…? షాక్ లో కాంగ్రెస్ పార్టీ…

 

  • కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ రాజీనామా
  • గత కొద్ది రోజులుగా పార్టీ తీరుపై ఆజాద్ అసంతృప్తి
  • పార్టీ పదవులతో పాటు సభ్యత్వానికి కూడా రాజీనామా
కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రోజురోజుకూ కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతున్న నేపథ్యంలో ఆ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్న సమయంలో ఆజాద్ నిర్ణయం అందర్నీ విస్మయానికి గురిచేసింది. కాంగ్రెస్ పార్టీకి గులాంనబీ అజాద్ రాజీనామా చేశారు.
పార్టీ పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. గతంలో రాజ్యసభ విపక్ష నేతగా, కేంద్రమంత్రిగా గులాంనబీ ఆజాద్ పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రానికి కూడా ఆయన ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు.2005-2008 వరకు జమ్ముకశ్వీర్ ముఖ్యమంత్రిగా గులాంనబీ ఆజాద్ పనిచేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*