కాకతీయుల కాలం నాటి అరుదైన బొజ్జ గణపయ్య ప్రత్యక్షం…

 

నల్గొండ జిల్లా నకిరేకల్ : నాయక చవితి వేడుకులకు అంత సిద్ధం చేసుకుంటున్నారు. ఊరూ, వాడా సంబంధం లేకుండా బొజ్జ గణపయ్యలను ఏర్పాటు చేసే పనిలో అంతా ఉన్నారు. ఈలోపు ఒక వార్త 13వ శతాబ్దం నాటి అతి చిన్న వినాయక విగ్రహం బయల్పడింది. వినాయక చవితికి రెండు రోజుల ముందు జరిగిన సంఘటన అందర్నీ ఆశ్చర్య పరిచింది. నల్గొండ జిల్లాలో పురావస్తు శాఖ అధికారులు చేపట్టిన తవ్వకాల్లో కాకతీయుల కాలం నాటి వినాయక విగ్రహం బయల్పడిందని, ఇప్పటి వరకు ఇదే అతి చిన్నదైన విగ్రహమని అధికారులు చెబుతున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పరడ గ్రామ శివార్లలో గుట్టమీద కొత్త రాతియుగం, ఇనుపయుగపు ఆనవాళ్లు.. గుట్ట దిగువన తూర్పు వైపు ఉన్న బౌద్ధ స్థూప శిథిలాలను పరిశీలిస్తుండగా వినాయక విగ్రహం బయల్పడిందని పురావస్తు శాఖ విశ్రాంత అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. అధికారులు తవ్వకాలు చేస్తున్న సమయంలో విగ్రహం లభించిందని పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*