
- అభాగ్యురాలి ఇంటిపై మంత్రి గన్‌మెన్, కానిస్టేబుల్ కన్ను
- రూ.40 లక్షల ఇంటిని రూ.10 లక్షలకే అమ్మాలని బెదిరింపులు
కాకినాడ సిటీ: ఆమె ఓ సాధారణ మహిళ. వెన్నెముక వ్యాధితో మంచాన పడిన తన కుమార్తె వైద్యంకోసం ఉన్న ఇంటిని అమ్మేయాలని నిర్ణయించింది. ఆ ఇంటిపై ఓ మంత్రి గన్‌మెన్, కానిస్టేబుల్ కన్ను పడింది. రూ.40 లక్షల విలువ చేసే ఇంటిని రూ.10 లక్షలకే అమ్మాలని వీరిద్దరూ బెదిరిస్తున్నారు. దీంతో అన్నవరానికి చెందిన ఆరుద్ర అనే మహిళ సోమవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టింది. అనంతరం స్పందనలో జిల్లా కలెక్టర్ వద్ద తన గోడు వెళ్లబోసుకుంది. తన కుమార్తె వెన్నెముక ఆపరేషన్‌కు రూ.2 కోట్లు ఖర్చు అవుతుండడంతో ఇంటిని అమ్మకానికి పెట్టానని వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్ కన్నయ్య, కానిస్టేబుల్ శివ తక్కువ రేటుకే అమ్మాలని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కానిస్టేబుల్‌పై అన్నవరం స్టేషన్‌లో, కలెక్టరేట్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని వాపోయింది.
Be the first to comment