131 బస్తాల అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్

 

మార్టూరు: ద్రోణాదులలో ఒక మహిళ అక్రమంగా నిల్వ చేసిన 131 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఆర్ . వాసుదేవరావు మంగళవారం పట్టుకున్నారు . మాగులూరి పూర్ణిమ అనే మహిళ 2 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే 5425 కిలోల రేషన్ బియ్యాన్ని తన గుడిసెలో దాచిందని డి . టీ చెప్పారు . కాగా పట్టుబడ్డ బియ్యాన్ని నిందితురాలిని మార్టూరు పోలీసులకు అప్పగించగా ఎస్సై రవీంద్రారెడ్డి కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*