పాదయాత్రకు డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ అన్నీ చంద్రబాబే: మంత్రి విడదల రజిని

 

మూడు రాజధానులనేది రాష్ట్ర ప్రభుత్వ విధానమని మంత్రి విడదల రజిని తేల్చిచెప్పారు.

ఈ మేరకు ఆదివారం మంత్రి విడదల రజిని మీడియాతో మాట్లాడుతూ..

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అన్నారు. మూడు రాజధానుల వల్ల ఉపయోగాలేంటో సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారన్నారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

అమరావతి రైతుల పాదయాత్రకు చంద్రబాబే డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ అని విడదల రజిని ఆరోపించారు. పాదయాత్రలో శాంతిభద్రతల సమస్య వస్తే చంద్రబాబే బాధ్యత వహించాలని మంత్రి రజిని డిమాండ్ చేశారు. ఇక, చంద్రబాబు మెడికల్ కాలేజ్ తీసుకురావాలన్న ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు.

కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక పద్ధతి, ప్రణాళిక ప్రకారం మెడికల్ కాలేజ్‌లు తీసుకొస్తున్నారని చెప్పారు. తల్లిలాంటి వైఎస్ భారతిపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, తాము కూడా అదేస్థాయిలో సమాధానం చెప్తామని మంత్రి విడదల రజిని హెచ్చరించారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాజధాని విషయంలో సుప్రీం కోర్టులో తీర్పు తమ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*