అమ్మాయి వీడియో కాల్ చేసిందని కక్కుర్తిపడ్డాడు.. కొద్దిసేపటికే ఊహించని ట్విస్ట్..

 

కర్నూలు: స్థానికుడైనా యువకుడికి రెండు రోజుల క్రితం ఓ నంబర్‌ నుంచి వీడియో కాల్‌ వచ్చింది. కాల్‌ లిఫ్ట్‌ చేయడంతో.. ఓ మహిళ సెమీ న్యూడ్‌గా కనిపించటంతో నోట మాట రాలేదు. భయంతో వెంటనే కాల్‌ కట్‌ చేశాడు. ఆ మహిళ మరోసారి ఫోన్‌ చేసి యువకుడితో మాట్లాడింది.. ఇంతలోనే వీడియో రికార్డు చేసింది. ఆ తర్వాతే అసలు ట్వస్ట్ బయటపడింది. యువకుడు న్యూడ్‌ఋగా ఉన్న మహిళలతో మాట్లాడుతున్నట్లు వీడియో క్రియేట్‌ చేసి అతడికి పంపారు. తమకు డబ్బు పంపాలని ఆ మహిళ డిమాండ్‌ చేసింది. డబ్బులు పంపకపోతే ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో అతడి స్నేహితులకు ఈ వీడియోను పంపుతానని బెదిరింపులకు దిగింది. అతడు వద్దని వేడుకున్నా ఆమె మాత్రం స్నేహితులకు పంపింది. ఆ తర్వాత మరో వాట్సాప్‌ నంబర్‌ నుంచి తాము సీబీఐ అధికారులమని.. యూట్యూబ్‌లో వచ్చిన వీడియోను వెంటనే డబ్బు ఇచ్చి డిలిట్‌ చేయుంచుకోవాలంటూ బెదిరించారు. ఆ మెసేజ్‌లు చూసిన యువకుడు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు ఇంకా అందలేదని తెలుస్తోంది. ఒకవేళ బాధితుడు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*