అర్ధరాత్రి కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంతో ఇల్లు మొత్తం పూర్తిగా దగ్ధమైన ఘటన…

 

చిలకలూరిపేట:  వేలూరు గ్రామం లోని మాదిగ పల్లి లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బొంతా రామయ్య అలియాస్ జేమ్స్ కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి సమయంలో ఇంటిపై నిద్రిస్తున్న క్రమంలో సుమారు రాత్రి రెండుగంటల సమయంలో ఇంటిలో ఉన్న కరెంట్ తీగల్లో షార్ట్ సర్క్యూట్ రావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి గృహం లో ఉన్న వస్తువులు, దుస్తులు ,నిత్యావసరాలు అదేవిధంగా ఇటీవలే డ్వాక్రా గ్రూపులో తీసుకున్న లక్ష రూపాయల నగదు మరియు చిన్న కుమార్తె వివాహం నిమిత్తం ఏర్పాటు చేసుకున్న మరి కొంత నగదు అదేవిధంగా బంగారం విలువైన వస్తువులు సైతం మంటల్లో పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి.

నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు పొగతో కూడిన మంటలు ఒక్కసారిగా రావడంతో అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇల్లు మొత్తం పూర్తిగా కాలిపోవడం జరిగింది. కాబట్టి ఒక్కసారిగా నిరాశ్రయులైన బాధితుల కుటుంబానికి సంబంధించిన ప్రభుత్వ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందించి కుటుంబం నష్టపోయిన సొమ్మును ఎక్స్గ్రేషియా రూపంలో చెల్లించాలని బాధితులు కన్నీటితో విజ్ఞప్తి చేశారు. సంబంధిత శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*