ఓవరాల్ ఛాంపియన్ షిప్ కప్ ను సాధించిన న్యూ షావోలిన్ కుంగ్-ఫూ అకాడమి…

 

చిలకలూరిపేట: స్థానిక సి.ఆర్ క్లబ్ లో నిర్వహిస్తున్న న్యూ షావోలిన్ కుంగ్ ఫు అకాడమీ అభినందన కార్యక్రములో ది.18-09-2022 ఆదివారం నాడు హైదరాబాద్, కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియం నందు సుమన్ షూటో ఖాన్ అకాడమీ నిర్వహించిన కన్నల్ సంతోష్ బాబు మెమోరియల్ కుంగ్ ఫు & కరాటే ఛాంపియన్ షిప్ – 2007 పోటీలలో మన న్యూ షావోలిన్ కుంగ్-ఫూ అకాడమి సి.ఆర్ క్లబ్ చిలకలూరిపేట నందు నిర్వహిస్తున్న కుంగ్-ఫూ అకాడమీ నుండి 20 మంది విద్యార్థులు, పసుమర్రు 7, గణపవరం 5, పోలిరెడ్డి పాలెం 5,స్థానిక కళామందిర్ సెంటర్ 5 మొత్తం 42 మంది విద్యార్థి విద్యార్థినీలు పాల్గొని బంగారు,కాంస్య,రజత పతకాలు సాధించి అబ్బురపరిచారు అలాగునే ఓవరాల్ ఛాంపియన్ షిప్ కప్ ను సినీ హీరో భానుచందర్ చేతులు మీదగా తీసుకోవడం చాల సంతోషముగా ఉంది అని అకాడమీ నిర్వహకులు బత్తుల విక్రమ్ తెలియజేసారు

మాస్టర్ దరియావలి మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజక వర్గములో ఉన్న ప్రతి తల్లి తండ్రులు తమ పిల్లలకి తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇప్చావలిసిందిగా కోరడమైనది సి.ఆర్ క్లబ్ నందు ప్రతిరోజు ఉదయం 06గంటల…నుండి…07:30 వరుకు జరుగును అని తెలియజే స్తున్నాము ప్రతి రోజు జరిగే శిక్షణ కార్యక్రమములో సీనియర్ మాస్టర్ Sk.దరియావలి గారి పర్యవేక్షణలో మాస్టర్స్ బత్తుల విక్రమ్, యడ్ల సురేష్, పాలపాటి నాగరాజు, కొర్రపాటి రాంబాబు, ఇన్స్ట్రక్టర్స్ ,యమ్.దుర్గాప్రసాద్, జి.రాహుల్ ప్రవీణ్, Sk.రబ్బానీ, విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ నందు శిక్షణ ఇవ్వబడును అని తెలియజేసారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*