హెల్త్ యూనివర్సిటీకి NTR పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం- MLA గొట్టిపాటి రవికుమార్

 

అద్దంకి:  హెల్త్ యూనివర్సిటీకి అన్న ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని తెలుగుదేశంపార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని,వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారన్నారు.

ఎన్టీఆర్ చొరవతో ఏర్పడిన యూనివర్సిటీ కావడంతో యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కు ఎన్టీఆర్ పేరు పెట్టి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గా నామకరణం చేయడం జరిగిందని తెలిపారు.

-జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని వైఎస్ఆర్ తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చెయ్యలేదని గుర్తు చేశారు.

36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం అర్థరహితమని వ్యాఖ్యానించారు.

వైకాపా ప్రభుత్వం మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టకపోగా ఉన్న వాటికే రంగులు వేసి,పేర్లు మార్చి స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను సైతం బలవంతంగా పక్కదారి పట్టించిన జగన్ ప్రభుత్వం….ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతుందని ప్రశ్నించారు?

కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసి ఇప్పుడు పేరు మార్చుతారా? అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ కు ఏం సంబంధం ఉందని అన్నారు?

దశాబ్దాల నాటి సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు సరికదా…ప్రజలు మీ దిగజారుడుతనాన్ని ఛీకొడతారని అన్నారు.

చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించండి. ఇకనైనా ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యధావిధిగా కొనసాగించాలని ఎమ్మెల్యే గొట్టిపాటి డిమాండ్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*