ఆపరేషన్ జీరో వెస్ట్,క్లిన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ Ch. గోవింద రావు, మున్సిపల్ చైర్మన్ SK. రఫ్ఫాని

 

చిలకలూరిపేట:  పురపాలక సంఘం,ఆపరేషన్ జీరో వెస్ట్,క్లిన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు విడదల రజిని ఆదేశాల మేరకు మునిసిపల్ కమీషనర్ Ch. గోవింద రావు ఆధ్వర్యంలో పురపాలక సంఘము పరిధిలోని స్థానిక 32వ వార్డు యందు పర్యటించడమైనది. .

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ సచివాలయ వార్డు హెల్త్ సెక్రెటరీలు రాబోవు వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలలో డెంగ్యూ వ్యాధి మరియు ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని సూచించారు. పట్టణంలో దోమల వలన డెంగ్యూ వ్యాధి మరియు ఇతర సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు వహించాలని, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారంలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దోమల నియంత్రణలో భాగంగా యాంటి లార్వా కార్యాచరణ, నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో ఆయిల్ బాల్స్ వేయించాలన్నారు.అదేవిధంగా అటో ల యందు తడి, పొడి, మరియు హానికరమైన చెత్త ను వేరు చేసి ఆటో లకు అందించే ల తగు చర్యలు తీసుకోవాలని కోరారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్. రఫ్ఫాని  మున్సిపల్ కమిషనర్ Ch. గోవింద రావు మున్సిపల్ డి ఈ రమణ  ఏఈ కోటేశ్వరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*