
చిలకలూరిపేట : మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్న శిఖా మరియమ్మ ను విధులలోకి తీసుకోవాలని సి పి ఐ ఏరియ ఇంఛార్జి కార్యదర్శి నాగభైరు రామ సుబ్బాయమ్మ తెలిపారు.బుధవారం మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ లను నాయకులు కలిసి వినతపత్రం అందించారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా మరియమ్మ ఎట్టు వంటి సమస్యలు లేకుండా పని చేస్తుంటే ఎట్టువంటి కారణం లేకుండా కనీసం నోటీసులు ఈవ్వకుండా సెప్టెంబర్ 03,2022 నుండి విధులకు హాజరు కావద్దని 1వ డివిజన్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ తెలపటం ఎంతవరకు సమంజసం కాదని అన్నారు.
పారిశుద్ధ్య కార్మికులను అకారణంగా విధుల నుంచి తొలగింపు చర్యలు చేపట్టడం న్యాయం కాదని ప్రశ్నించారు. కార్మిక హక్కులకు విరుద్ధంగా తొలగింపుపై నిరసన కార్యక్రమాలు చేపడతామని నాయకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి నియోజకవర్గ అధ్యక్షులు పేలూరి రామారావు, సిపిఐ సీనియర్ నాయకులు నాయుడు శివ కుమార్, వేలూరు గ్రామ లెనిన్ యూనిట్ సిపిఐ శాఖ కార్యదర్శి బొంతా భగత్ సింగ్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment