APSRTC నాన్ ఏసీ స్లీపర్ బస్సులు దశర కల్లా అందుబాటులోకి…

 

ఆంధ్రప్రదేశ్‌లో నాన్ ఏసీ స్లీపర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ‘స్టార్ లైనర్’ [STAR (Sleep Travel and Relax) Liner] పేరుతో పిలుస్తున్న ఈ బస్సులను దసరా పండగ నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. వివిధ మార్గాల్లో మొత్తం 62 స్టార్ లైనర్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రయోగాత్మకంగా ఈ బస్సులు నడుపుతున్నామని.. మంచి స్పందన వస్తే బస్సుల సంఖ్య పెంచుతామని చెప్పారు. ఫలితాలు బాగా లేకుంటే, పాత పద్ధతినే అమలు చేస్తామని తెలిపారు.

స్టార్ లైనర్ బస్సులు, ఇతర అంశాలకు సంబంధించి ప్రయాణికులు ఏవైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే.. టోల్ ఫ్రీ 0866-2570005 నంబర్‌కు ఫోన్ చేయొచ్చని ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఏవైనా ఫిర్యాదులు ఉన్నా ఇదే నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. ఫిర్యాదులు, సలహాల కోసం 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

దసరా సందర్భంగా 4,100 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి ఈ ప్రత్యేక బస్సులకు అదనపు ఛార్జీలు సైతం వసూలు చేయడం లేదని పేర్కొంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులకు పెంచిన పీఆర్‌సీకి అనుగుణంగా వేతనాలు చెల్లిస్తామని సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పదోన్నతులు పొందిన 2 వేల మంది ఉద్యోగులకు పదోన్నతుల ఆమోదం తర్వాతే పెంచిన వేతనాలు చెల్లిస్తామని చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*