కోజికోడ్ (కేరళ) బయలుదేరిన   CPI (ML) రెడ్ స్టార్  నాయకులు!

 

మార్టూరు:   సిపిఐ (ఎమ్.ఎల్) రెడ్ స్టార్  నాయకులు కోజికోడ్ కేరళ లో  ఈ నెల 24 నుంచి 29 వరకు జరిగే  సిపిఐ ( ఎమ్.ఎల్ ) రెడ్ స్టార్ 12 వ జాతీయ కాంగ్రెస్ లో పాల్గొనడానికి  బయలుదేరి వెళ్లారు. ఈ మహాసభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 20 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.

గుంటూరు నుండి ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మన్నవ హరి ప్రసాద్,  రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు షేక్ మహ్మద్ బాషా,   రాష్ట్ర కమిటీ సభ్యులు పిల్లి చెన్నకేశవులు, వెనిగళ్ళ పుష్పలత, షేక్ సుజాత, పద్మ, కమాలుద్దీన్, ఖాజా, నాగేశ్వరరావు తదితరులు బయలుదేరి వెళ్లారు.

ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు కామ్రేడ్ మన్నవ హరి ప్రసాద్  మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కోజికోడ్ మహాసభలో 20 మంది ప్రతినిధులు పాల్గొంటారని, దేశంలోని 20 రాష్ట్రాల నుండి సుమారు 400 మంది ప్రతినిధులు, 50 మంది సౌహార్ద ప్రతినిధులు , 15 దేశాలనుండి ఇంటర్నేషనల్  కోఆర్డినేషన్ ఆఫ్ కమ్యూనిస్టు రివల్యూషనరీస్ (ఐకార్) భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు, జర్మనీ ,  రష్యా, ఇంగ్లాండ్, నేపాల్, శ్రీలంక , బంగ్లాదేశ్, సింగపూర్ , మలేషియా, మొదలగు దేశాల నుండి హాజరవుతారన్నారు. అదేవిధంగా అంతర్జాతీయంగా 45 దేశాల నుండి సౌహార్ద సందేశాలు ఉంటాయన్నారు. భారతదేశంలోని , సిపిఐ (ఎం.ఎల్ )ప్రజా పంథా, . ఎం సిపిఐ( యు),ఆర్.ఎం.పి ఐ, అనేక కమ్యూనిస్టు, విప్లవ సంస్థల పార్టీల నాయకులు ఈ మహా సభల లో పాల్గొని సౌహార్ద సందేశాలు ఇస్తారని అన్నారు. అదేవిధంగా ఈ మహాసభలో  ” -ఫాసిజం- యుద్ధము- శాంతి”  అనే అంశంపై అంతర్జాతీయ సెమినార్ ఉంటుందని ఆయన వివరించారు. అమెరికా సామ్రాజ్యవాదానికి జూనియర్ భాగస్వామి గా భారత  పాలకవర్గాలు వ్యవహరిస్తున్నాయని, అదేవిధంగా దేశంలోని సంపదను బహుళజాతి సంస్థలకు  కట్ట పెడుతున్నారన్నారు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత  అంబానీ, గౌతమ్ ఆదానీ లకు దేశ సంపదను ధారా దత్తం చేస్తున్నారని,  అంబానీ, గౌతమ్ ఆదాని లాంటి గుజరాత్ ఫేమ్ “క్రోనీ క్యాపిటలిజం” నేడు దేశంలో రాజ్యమేలుతుందని ఆయన అన్నారు. లాభాలను ఆర్జిస్తున్న రైల్వేలు, ఎల్ఐసి, విశాఖ ఉక్కు,  లాంటి సంస్థలను పెట్టుబడిదారులకు  అప్ప చెబుతున్నారు.

చిన్నాచితక పార్టీలను,  అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్, టిడిపి, జనసేన లాంటి పార్టీలను, వివిధ ప్రాంతీయ పార్టీలలో ఉన్న నాయకులను  “ఈ డి”, సీబీఐ”  లాంటి  సంస్థలను ప్రయోగించి  అవినీతిపరులైన ఆ నాయకులను ,పార్టీలను, చట్టసభ  సభ్యులను లొంగ తీసుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

మరొక ముఖ్య నాయకుడు రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యుడు షేక్ మహ్మద్ బాషా మాట్లాడుతూ- రెండవ  సారి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భాజపా అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి   కాశ్మీర్ విషయం పై కానీ, రామ జన్మభూమి అయోధ్య కేసులో తీర్పు కానీ, సీ ఏ ఏ, ఎన్ ఆర్పి , 3 వ్యవసాయ నల్ల చట్టాలమ,  4 లేబర్ కోడులు కానీ  ఇవి అన్ని ఫాసిస్టు కార్పోరేట్ అజెండాలో భాగమేనని ఆయన అన్నారు, ఆర్ ఎస్ ఎస్/ మనువాద/ కాషాయ /కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా   12వ జాతీయ మహాసభ  అనేక ముఖ్యమైన తీర్మానాలు చేస్తుందని, ప్రజాతంత్ర విప్లవ సాధనలో, అంతిమంగా సోషలిజం స్థాపన కొరకు సిపిఐ( ఎం.ఎల్) రెడ్ సార్ పార్టీ పనిచేస్తుందన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*