తెనాలిలో పునీత్ రాజ్‌కుమార్ విగ్రహం… 3డీ సాంకేతికతతో 21 అడుగుల ఎత్తు…

 

కన్నడ నటుడు దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ భారీ విగ్రహం సిద్ధమైంది.

గుంటూరు జిల్లా:  తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షలు భారీ ఫైబర్‌ గ్లాస్‌ విగ్రహాన్ని రూపొందించారు. 21 అడుగుల ఎత్తులో ‘3డి’ సాంకేతికతతో ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశారు.. రూపొందించడానికి నాలుగు నెలల సమయం పట్టింది. బెంగళూరులో ప్రదర్శన కోసం ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలిపారు. స్థానిక సూర్య శిల్పశాల దగ్గర ఈ విగ్రహాన్ని ప్రదర్శనగా ఉంచారు.

ఈ విగ్రహాన్ని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఆవిష్కరించి, శిల్పులను అభినందించారు. అలాగే ‘3డి’ సాంకేతికతతో తయారుచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిన్న ప్రతిమను శిల్పి శ్రీహర్ష ఎమ్మెల్యేకు బహూకరించారు. త్వరలోనే పునీత్ రాజ్‌కుమార్ విగ్రహాన్ని బెంగళూరుకు తరలించనున్నారు.

మరోవైపు బెంగళూరులో పునీత్‌రాజ్‌కుమార్‌ పేరిట నిర్మించిన పార్కు ప్రారంభమయ్యింది. నగరానికి చెందిన కొంతమంది యువకులు పునీత్‌ పేరిట తాళూరు రోడ్డులోని బాలభారతి స్కూల్‌ ఎదురుగా ఉన్న కురువల్లి ఎన్‌క్లీవ్‌లో పార్కును నిర్మించారు. పునీత్‌ రాతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. బుధవారం మంత్రి శ్రీరాములు దీనిని ప్రారంభించారు.

పునీత్‌ రాజ్‌కుమార్‌ గతేడాది అక్టోబర్‌లో కన్నుమూశారు. ఉద‌యం జిమ్ చేస్తుండ‌గా గుండె నొప్పి రావ‌డంతో ఒక్కసారిగా కుప్పకూలిన ఆయన్ను వెంటనే బెంగుళూరులోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ పునీత్‌ రాజ్‌కుమార్‌ తుది శ్వాస విడిచారు. ఈయ‌న్ని క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మలో ప‌వ‌ర్ స్టార్ అని, అప్పు అని ముద్దుగా పిలుస్తుంటారు. ఐదేళ్ల వ‌య‌సులోనే ఆయ‌న సినీ రంగ ప్ర‌వేశం చేసిన ఆయన.. తండ్రి రాజ్ కుమార్‌తోనూ క‌లిసి న‌టించారు. ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్‌ అయ్యాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*