ఆదివారం (అక్టోబర్ 30) కావడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు తెలుస్తోంది. మచ్చూ నదిపై నిర్మించిన ఈ తీగల వంతెనపై 5 రోజుల కిందటే మరమ్మతు పనులు చేపట్టారు. ఇంతలోనే దుర్ఘటన జరగడం విమర్శలకు తావిస్తోంది. ప్రమాద సమయంలో వంతెనపై 400 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు గుజరాత్ హోం మంత్రి తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. ‘మోర్బీలో వంతెనపై జరిగిన ఘోర ప్రమాదం (Tragedy) దిగ్భ్రాంతి కలిగించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాను’ అని సీఎం భూపేంద్ర పటేల్ ట్వీట్ చేశారు.
Be the first to comment