క్లాస్ రూంలోనే మహిళా లెక్చరర్ గొంతు కోసిన భర్త…

 

  • అనంతపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
  • ఆర్ట్స్‌ కళాశాలలో విద్యార్థులు చూస్తుండగానే మహిళా లెక్చరర్‌పై హత్యాయత్నం జరిగింది.
  • కళాశాలలో గురువారం లెక్చర్ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆమె భర్త పరేష్ క్లాస్ రూమ్‌లోకి దూసుకొచ్చాడు.
  • తన వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా దాడి చేసి గొంతు కోశాడు.
  • దీంతో క్లాస్ రూమ్‌లో భీతావహ వాతావరణం నెలకొంది.
  • విద్యార్థులు కేకలు వేస్తూ భయంతో వణికిపోయారు.
  • ఈ ఘటనలో లెక్చరర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
  • వెంటనే అప్రమత్తమైన విద్యార్థులు, కళాశాల యాజమాన్యం చికిత్స అందించేందుకు సుమంగళిని ఆస్పత్రికి తరలించారు.
  • ఆమెను పరీక్షించిన అనంతపురం ప్రభుత్వాసుపత్రి వైద్యులు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెప్పారు.

20 ఏళ్లు గుంటూరులో లెక్చరర్‌గా పనిచేసిన సుమంగళి.. ఏడాది క్రితమే అనంతపురం ఆర్ట్స్ కళాశాలకు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం అనంతపురంలోని శ్రీనివాస్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, భర్తతో విభేదాల కారణంగా కొంతకాలం క్రితం సుమంగళి కోర్టులో విడాకులు ఇప్పించాలంటూ కేసు వేశారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఆమెపై భర్త దాడి చేసినట్లు సమాచారం. ఈ సమాచారం అందుకు పోలీసులు ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*