రోడ్డు ప్రమాదం… శబరిమల వెళ్లిన 18మంది AP భక్తులకు తీవ్ర గాయాలు…

 

ఏలూరు జిల్లాకు చెందిన 40 మంది శబరిమల భక్తులు వాహనంగా గుర్తించారు. కేరళ రాష్ట్రం పాతనంతిట్ట జిల్లాలోని లాహా దగ్గర వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. 18 మంది శబరిమల వెళ్లిన భక్తులకు గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. బాధితుల్ని కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తులు ప్రయాణిస్తున్న బస్సు శబరిమల దర్శనం ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వస్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన వారిని పతనంతిట్ట జనరల్ ఆసుపత్రిలో చేర్చగా.. మిగిలిన వారిని రాణి పెరునాడ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద స్థలాన్ని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి సందర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ప్రమాద సమయంలో బస్సులో 40 మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఈ నెల 15న శబరిమలకు వెళ్ళారు.. అక్కడ దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేక్ డౌన్ వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎంవో అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి సరైన సహాయం అందించేలా చూడాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించడమే కాకుండా, యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పించేలా చూడాలన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఏపీకి చెందిన భక్తుల బృందం మొత్తం 3 బస్సుల్లో శబరిమల వెళ్లారని, ఈమూడు బస్సులు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఉదయం 8:10 గంటలకు పతనంమిట్ట వద్ద ఒక బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు.

ఈ ప్రమాదానికి గురైన బస్సులో 44 మంది ప్రయాణిస్తున్నారని, 18 మంది గాయపడ్డారని, ఇందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో వీరికి చికిత్స అందిస్తున్నామని, మిగిలిన యాత్రికులకు వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పతనంమిట్ట జిల్లా అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*