
పల్నాడు జిల్లా, వినుకొండ: పట్టణంలో మట్కా జూదం సాగుతుందని సమాచారంతో SEB జెడి ఆదేశాల మేరకు ప్రత్యేక CI ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు నిర్వహించడం జరిగిందని ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. పట్నంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాకెట్ (మట్కా) జూదం ఆడుతున్న 6గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది అన్నారు. బ్రాకెట్ జూదానికి వ్యసనంగా మారి ఆర్థికంగా నష్టపోతు పేద కుటుంబాలు చిన్న భిన్నమైన సందర్భాలు ఉన్నాయని, నిషేధిత మట్కా జూదం నేరమని, దీని వెనక పెద్దల హస్తాలు ఉన్నాయని, ఇటువంటి జూదాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది తెలిపారు.
Be the first to comment