
బాపట్ల: కార్తీక మాసంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు బాపట్ల సముద్రతీరానికి పోటెత్తారు. అయితే.. సముద్రస్నానం చేసే క్రమంలో ఇద్దరు యువతులు గల్లంతు అయ్యారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది దీన్ని చూశారు. వెంటనే అప్రమత్తమై.. గల్లంతు అవుతున్న యువతులను ప్రాణాలకు తెగించి కాపాడారు. వారిని ఒడ్డుకు చేర్చి.. పోలీసులు సీపీఆర్ (CPR) నిర్వహించి యువతుల ప్రాణాలను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీస్ సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ పోలీస్ సిబ్బందిని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి అభినందించారు.
బాపట్ల బీచ్ లో కార్తీకమాసం సంధర్బం గా సముద్ర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చి, సముద్రపు నీటిలో మునిగిపోయి గల్లంతవుతున్న ఇద్దరు యువతలను, ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీస్ సిబ్బందిని డి.జి.పి గారు అభినందించారు. pic.twitter.com/oGfithr9Fq
— Andhra Pradesh Police (@APPOLICE100) November 22, 2022
Be the first to comment