కోనంకిలో పాస్టర్ రెవ|| బండారు రూబేను ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

 

బాపట్ల జిల్లా : మార్టూరు మండలం, కోనంకి గ్రామంలో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా గ్రామస్తులు నిర్వహించారు. తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ రూబేను ఈ కార్యక్రమాన్ని కేక్ కటింగ్ తో మొదలుపెట్టారు. తదుపరి పిల్లలు డాన్సులు, స్క్రిప్టులు, బైబిల్ క్విజ్ పోటీలు జరిగాయి. పాస్టర్ వాక్య పరిచర్య చేస్తూ… సంవత్సరం చివరి నెల డిసెంబర్ మొదలవ్వగానే అందరికీ గుర్తొచ్చేది క్రిస్టమస్. అనగా ఏసుక్రీస్తు జన్మించిన నెల. అందుకే ఈ పండగకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు.

ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న  క్రైస్తవులందరు ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో జరుపుకుంటారు. క్రైస్తవులు తమ ఇంటి ముందు, పైన స్టార్స్‌ను వ్రేలాడిస్తారు. ఇంటి లోపల క్రిస్మస్‌ ట్రీని, రంగు రంగు లైట్లతో అలంకరించి పెట్టుకుంటారు. అలాగే గ్రామాలు, నగరాలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా క్రిస్మస్‌ ట్రీ, స్టార్స్‌, క్రిస్మస్‌ తాతలు దర్శనమిస్తాయి అని చెప్పారు. క్రిస్టమస్ కంటే ముందుగా ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో కోనంకి తెలుగు బాప్టిస్ట్ చర్చ్ విశ్వాసులతో కలిసి ఈ సెమి క్రిస్టమస్ వేడుక జరుపుకుంటామని,

ఈ కూటములో చిన్నారులతో డ్యాన్సులు, స్క్రిప్ట్లలు, వాక్యాలు జరుగుతాయని చెప్పారు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమా విందు ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు… ఈ కార్యక్రమంలో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ విశ్వాసులు, పిల్లలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*