
చిలకలూరిపేట : నిత్యం దేవునికి పవిత్ర ప్రార్ధనలు చేసేవారు ధన్యులని జానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదా అన్నారు.ఆదివారం మండల కేంద్రమైన యడ్లపాడు గ్రామములోని మసీదు నందు జానేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేష్ ఇమామ్ లకు ఆర్ధిక సహాయం చేసే కార్యక్రమంలో జాన్ సైదా ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. అన్ని మతాలలో ఉన్న పేద విద్యార్థులకు వారి ఉన్నతి చదువులకు జాన్ సైదా సహాయం చేయటం గొప్ప విషయమని మండల వైస్సార్సీపీ మాజీ అధ్యక్షులు చల్లా విఘ్నేశ్వర రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు వేటపాలెం సుభాని, అన్సార్, 15వ వార్డు కౌన్సిలర్ జలాది సుబ్బారావు, వైస్సార్సీపీ నాయకులు గొంటు శ్రీనివాసరెడ్డి, బి వి రెడ్డి, రత్నారెడ్డి, శేషు రెడ్డి, కరిముల్లా, సుభాని, మోబిన్ తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment