YSRCP ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్థంతి వేడుకలు

 

  • బీసీ,యస్.సి,ఎస్టీ మైనార్టీల అందరి సమిష్టికృషితో మళ్ళీ చిలకలూరిపేట కోటపై వై.యస్.ఆర్.సీపీ జెండా ఎగురవేస్తాం, మంత్రి రజిని గారిని మళ్ళీ గెలిపిస్తాం
  • అంగరంగవైభవంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్థంతి వేడుకలు

చిలకలూరిపేట: నియోజకవర్గ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్థంతి వేడుకలు, ముందుగా పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే గ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు,అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి గడియారస్థంభం సెంటర్ దగ్గర ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే,సావిత్రిబాయి పూలే గార్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడని,ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి చిన్న పిల్లలని ముసలివారికిచ్చి పెళ్ళి చేయడం వల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు.

దీంతో వితంతు వివాహాలను చేయాలని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు ప్రపంచానికే జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శం అని,విద్య వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానత్వం నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారని,సమాజం విద్యా పరంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి అవుతుందని ఆశించారని ఈనాడు ఆ ఆశయాలని కొనసాగించడానికి ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి బీసీ ల అభ్యున్నతికి కృషిచేస్తున్నారని 139 బీసీ కులాలు కోసం 59 బీసీ కుల కార్పొరేషన్ లు ఏర్పాటు చేయడం శాసనమండలి ఎన్నికల్లో 32మంది ఉంటె వారిలో 18మంది బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు ఉన్నారు. రాజ్యసభకు నాలుగు స్థానాలు ఖాళీలు వస్తే 50శాతం బీసీలను ఎంపిక చేశారు.


జగన్‌ మోహన్‌ రెడ్డి ఎప్పుడో చెప్పారు… బీసీలు అంటే వెనుకబడిన కులాల కాదు, వెన్నెముక కులాలు అని. భారతదేశ సంస్కృతిని సంరక్షించేటువంటి గొప్ప సంపద బీసీలని, మనిషి అవసరాలను తీర్చేవాడే బలహీనవర్గీయుడు అని చెప్పారు. మీరు బీసీలను ఎప్పుడూ వెనకే పెట్టారు. అదే జగన్‌ గారు బీసీలను ముందువరుసలో నడిపిస్తున్నారు. బీసీల అభివృద్ధి, అభ్యున్నతికి కృషి చేసే విషయంలో చంద్రబాబు ఎన్నడూ జగన్‌ మోహన్‌ రెడ్డికి సాటిరాడని స్పష్టం చెబుతున్నాం,ఆంధ్రప్రదేశ్‌లో 10 మంది బీసీలకు కూడా మంత్రి పదవులు రాని చరిత్ర ఉంటే, సీఎం జగన్‌ 70 శాతం కేబినెట్‌ పదవులు వెనుకబడిన వర్గాలకే ఇచ్చారని అన్నారు,అలానే ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రి రజిని గారికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించినప్పుడు బీసీ లకి టిక్కెట్ ఇస్తారా,గెలుస్తారా అని అవహేళన చేసారు చాలామంది, వాళ్ళందరి చెంప చెల్లుమనేలా ఇక్కడ ఎమ్మెల్యే గా గెలవటం,

ఆ తరువాత తనలో ఉన్న ప్రతిభ గుర్తించి ముఖ్యమంత్రి గారు మంత్రిగా ప్రకటించి, రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులుగా నియమించటం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు,

 

ఎవరెన్ని కుట్రలు చేసిన, పన్నాగాలు పన్నిన మళ్ళీ మా బడుగుబలహీనవర్గాలందరం పేట కోటపై వై.యస్.ఆర్.సీపీ జెండా ఎగురవేస్తాం, మంత్రి రజినిని మళ్ళీ గెలిపిస్తాం అన్నారు,ఎందుకంటే ఇప్పటివరకు చిలకలూరిపేట చరిత్రలో లేనివిధంగా రెండు సార్లు మార్కెట్ యార్డ్ చైర్మన్, ఒక మున్సిపల్ చైర్మన్ మా బడుగు బలహీనవర్గాల కి కేటాయించారని అన్నిట్లో సముచిత స్థానం కల్పిస్తున్న రజినమ్మకి మేమందరం రుణపడి ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు,ఎంపీటీసీలు,సర్పంచులు,కౌన్సిలర్లు,పార్టీ వివిధ అనుబంధ విభాగాల నాయకులు,బీసీ నాయకులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*