
చిలకలూరిపేట: జనసేన పార్టీ ఆధ్వర్యంలో కస్తూరిబాయ్ రోడ్డులో గల మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజ రమేష్ మాట్లాడుతూ బహుజనుల జీవితాలలో వెలుగులు నింపిన వ్యక్తి పూలే అని, సమాజంలో మగవారితో పాటు మహిళలకు సమాన హక్కులు ఉండాలని పోరాడిన వ్యక్తి పూలే గారు అని, కుల,మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు విద్య అందాలని పాటుబడిన గొప్ప సంఘ సంస్కర్త బాపూజీ జ్యోతిరావు పూలే గారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట మండల అధ్యక్షులు పటాన్ ఖాదర భాష, మునీర్ హసన్, అచ్చు కోల బ్రహ్మ స్వాములు వెంకటస్వామి, లీలా కిషోర్, స్టీల్ అంజి, జానీ భాష, మోహన్ మన్యపులి, అయ్యప్ప స్వామి నాయుడు, అప్రోజు, పెద్దింటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment